సినిమాలకు బ్రేక్ ఇచ్చిన వెంకటేష్

హీరో వెంకటేష్‌ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. దీంతో ఆయన నెక్ట్స్ మూవీ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. కథ ఫైనల్ కాకపోవడం వలన వెంకీ ఇన్ని రోజులు కొత్త సినిమా ప్రకటించలేదు అనుకున్నారు కానీ.. అందుకు వేరే కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. హెల్త్ ప్రాబ్లమ్ వలన కొత్త సినిమాని వెంకటేష్ ప్రకటించలేదట. గత కొన్ని రోజులుగా కాలినొప్పితో బాధపడుతున్న వెంకీకి ట్రీట్మెంట్ చేశారని..వైద్యులు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో ఇంటికే పరిమితం అయ్యారట.

వెంకటేష్ కథలు కూడా వినడం లేదట. పూర్తిగా హెల్త్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. రెండు మూడు నెలల పాటు వెంకీ సినిమా విషయాలకు దూరంగా ఉండబోతున్నారు. ఏది ఏమైనా వెంకటేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్స్ కావాలంటే కనీసం మూడు నెలలు టైమ్ పట్టొచ్చు. వెంకీ తదుపరి మూవీ డైరెక్టర్ గా హరీష్ శంకర్ పేరు వినిపిస్తోంది.