మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు మల్లిడి వశిష్ట్ తెరకెక్కిస్తోన్న మూవీ విశ్వంభర. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వీ క్రియేషన్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సినిమా సంక్రాంతికి రావాలి కుదరలేదు. ఆతర్వాత సమ్మర్ లో రిలీజ్ అనుకున్నారు కానీ.. ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. ఆగష్టులో రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి టైటిల్ పెట్టక ముందు చిరు 157 మూవీ అంటూ అనౌన్స్ చేశారు. విశ్వంభర అనే టైటిల్ అనౌన్స్ చేయకముందు చిరు 157 మూవీ అంటూ మేకర్స్ చెప్పడం.. మీడియాలో అలాగే రాశారు.
నిన్న ఉగాది రోజున మెగాస్టార్ కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి డైరెక్టర్. అయితే.. ఈ చిత్రానికి చిరు 157 అంటూ అనౌన్స్ చేశారు. దీంతో కన్ ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. విశ్వంభర చిరు 157వ సినిమా అయితే అనిల్ రావిపూడితో చేస్తోన్న మూవీని 157 సినిమా ఎలా అవుతుంది అనే ప్రశ్న మొదలైంది. విశ్వంభర రిలీజ్ కంటే ముందుగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారా..? అందుకనే ఇలా చిరు 157 అని ప్రచారం చేస్తున్నారా..? అనే సందేహాలు వస్తున్నాయి. ఈ కన్ ఫ్యూజన్ పై మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వాల్సిఉంది.