వెంకీ.. ఔనంటాడో కాదంటాడో..!

విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అంటూ కెరీర్ లో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఈ సినిమా సక్సెస్ తర్వాత వెంకీ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు. సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కంటే ముందుగా ఓకే చేసిన కథలను వెంకటేష్ పక్కనపెట్టేసారట. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ తర్వాత ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారట. సురేందర్ రెడ్డి, విమల్ కృష్ణ, తరుణ్‌ భాస్కర్, నక్కిన త్రినాథరావు.. ఇలా కొంత మంది దర్శకుల కథలకు ఓకే చెప్పినప్పటికీ ఇప్పుడు నో చెప్పారట.

ఇదే క్రమంలో ఇప్పుడు వెంకటేష్ డైరెక్టర్ గా హరీష్‌ శంకర్ పేరు వినిపిస్తోంది. సామజవరగమన రైటర్స్ లో ఒకరైన నందు వెంకీకి ఓ కథ చెప్పాడట. ఆ కథ నచ్చిందట కానీ.. అతనికి డైరెక్షన్ లో అనుభవం లేకపోవడంతో కథ తీసుకుని వేరే డైరెక్టర్ తో సినిమా చేయాలి అనుకుంటున్నారట. ఈ సినిమాకు హరీష్ శంకర్ పేరు డైరెక్టర్ గా వినిపిస్తున్నా..చాలా కాలం తర్వాత సోలో హీరోగా సక్సెస్ చూసిన వెంకటేష్ ..ఈ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా ఒప్పుకునే సాహసం చేయకపోవచ్చు. ఒకవేళ ముందు ఔనన్నా, మిగతా దాదాపు అరడజను డైరెక్టర్స్ కు చెప్పినట్లే కాదనవచ్చు.