పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న కొత్త సినిమా హరి హర వీరమల్లు. ఈ భారీ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. క్రిష్ ఈ మూవీ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ చేసిన తర్వాత ఆ బాధ్యతను ఏఎం జ్యోతికృష్ణకు అప్పగించారు. మార్చి 28న రిలీజ్ చేయాలి అనుకున్నారు. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. రెండు పాటలు రిలీజ్ చేశారు. ఆతర్వాత షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదని మే 9కి వాయిదా వేశారు. ఈ సినిమా విషయంలో ఏం జరుగుతోంది అనేది సస్పెన్స్ గా మారింది.
తాజా సమాచారం ప్రకారం.. వీరమల్లు మూవీ షూటింగ్ ఖమ్మంలో జరుగుతుందని తెలిసింది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ నటిస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఏ రేంజ్ లో మెప్పిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. ఇందులో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తోంది. అనసూయ భరద్వాజ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తీయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉండడంతో ఈ సినిమాని ఒక పార్ట్ లోనే కంప్లీట్ చేస్తారా..? రెండు పార్టులుగా తీస్తారా..? అనేది తెలియాల్సివుంది.