“పెద్ది” పై మెగాస్టార్ రియాక్షన్ ఇదే..!

తండ్రిగా రామ్ చరణ్ కెరీర్ లో ఎదుగుతున్న తీరును, నటుడిగా అతని క్రమశిక్షణను, వ్యక్తిగా ప్రవర్తనను చూసి గర్వపడుతుంటారు మెగాస్టార్ చిరంజీవి. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా పెద్ది టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చరణ్ కు బర్త్ డే విశెస్ చెబుతూ పెద్ది సినిమాపై స్పందించారు.

చిరంజీవి ట్వీట్ చేస్తూ – హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్..పెద్ది సినిమా ఫస్ట్ లుక్ ఇంటెన్స్ గా ఉంది. ఈ సినిమా నటుడిగా నీలోని కొత్త డైమెన్షన్ చూపిస్తుందని, మూవీ లవర్స్ ను అలరిస్తుందని అంటూ ట్వీట్ చేశారు. పెద్ది సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ ఇంత ఇంటెన్స్ గా ఇప్పటిదాకా కనిపించలేదని టాక్ వినిపిస్తోంది.