ఆడియెన్స్ ను థ్రిల్ చేయనున్న ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇది బ్రిటీష్ కాలం నాటి కథతో పీరియాడిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ సైనికుడుగా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడు ఈ సినిమాలో ఇంత వరకు ప్రభాస్ చేయనటువంటి పాత్ర పోషిస్తున్నాడని ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందులో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడుగా నటిస్తున్నాడట. ఈ పాత్రలో ప్రభాస్ లుక్, బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుందని.. ఆడియన్స్ కి సర్ ఫ్రైజింగ్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తన ప్రతి చిత్రంలోనే కొత్తదనం చూపిస్తున్న ప్రభాస్ ఈ సినిమాతో ఆడియెన్స్ థ్రిల్ కలిగిస్తాడని అంటున్నారు మేకర్స్. ఫౌజీతో పాటు ది రాజాసాబ్ మూవీలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు. ఆయన లైనప్ లో సందీప్ వంగాతో స్పిరిట్ మూవీ ఉంది. రాజాసాబ్ ఏప్రిల్ లో రావాల్సింది.. సెప్టెంబర్ లో వచ్చేందుకు రెడీ అవుతోంది. ఫౌజీ డిసెంబర్ లో రావాలి కానీ.. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలిసింది.