మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇలాగే నెక్ట్స్ సంక్రాంతికి కూడా మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ ఇవ్వాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఆయన విశ్వంభరతో ఈ సంక్రాంతి మిస్ అయ్యారు. నెక్ట్స్ సంక్రాంతికి మాత్రం తన మూవీ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు. షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తోంది.
సంక్రాంతికి మూవీ రిలీజ్ ప్లాన్ చేసినా టైమ్ అనేది మెగాస్టార్ మూవీకి రియల్ ఛాలెంజ్ గా మారనుంది. సినిమాను ఈ 8, 9 నెలల్లో పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేయాలి. చిరంజీవితో చేస్తున్న ఈ భారీ చిత్రానికి టాకీ, పాటలు, పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీగా చేయాలంటే ఈ టైమ్ ఎంతవరకు సరిపోతుంది అనేది ఇప్పుడీ టీమ్ ముందున్న బిగ్ టాస్క్. ఈ టాస్క్ సక్సెస్ ఫుల్ గా చేస్తేనే సంక్రాంతికి ప్రమోషన్ తో సహా సినిమాను రిలీజ్ చేయగలరు. డైరెక్టర్ అనిల్, మెగాస్టార్ ఈ ఫీట్ చేయగలరా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయ్యింది. త్వరలోనే అఫీషియల్ గా లాంఛ్ చేయబోతున్నారు.