తెలుగులో యంగ్ హీరోయిన్స్ కొరత బాగానే ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది రితిక నాయక్. ఇప్పటికే పలు క్రేజీ మూవీస్ లో నటిస్తున్న ఆమె మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లో నాయికగా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా దర్శకుడు సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న సినిమాలో రితిక నాయక్ ను హీరోయిన్ గా తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
గోపీచంద్ కు హీరోగా పెద్దగా ఫేమ్ లేదు. వరుసగా ఫ్లాప్స్ చూస్తున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. హీరో స్టార్ డమ్ కాకుండా సినిమా పరంగా చూస్తే రితికకు ఇది పెద్ద ఆఫర్ అని చెప్పాలి. ప్రస్తుతం ఆమె ఆనంద్ దేవరకొండతో డ్యూయెట్, తేజ సజ్జా మిరాయి, వరుణ్ తేజ్ వీటీ 15 చిత్రాల్లో నటిస్తోంది. ఈ సినిమాల్లో ఒకట్రెండు మంచి హిట్స్ అయినా రితిక స్టార్ డమ్ చూస్తుందనే అనుకోవచ్చు.