వరుణ్ ఆశలన్నీ ఈ హారర్ కామెడీ మూవీపైనే

వరుణ్ తేజ్ హీరోగా ఇటీవల చాలా ఫ్లాప్ మూవీస్ చూస్తున్నాడు. గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా.. ఇలా వరుణ్‌ నుంచి రీసెంట్ గా వచ్చిన సినిమాలు మెప్పించలేకపోవడంతో ఆయన కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి టైమ్ లో తను కొత్తగా మొదలుపెట్టిన హారర్ కామెడీ మూవీపైనే హోప్స్ పెట్టుకున్నాడు వరుణ్ తేజ్. మరోవైపు ఈ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీకి కూడా సక్సెస్ లేదు. వీళ్లిద్దరికీ ఈ మూవీ కీలకం కానుంది. ఈ చిత్రాన్ని యు.వీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇప్పటి వరకు వరుణ్ తేజ్ హర్రర్ కామెడీ చేయలేదు. పైగా డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఎంటర్ టైన్మెంట్ ను బాగా డీల్ చేయగలడు అనే పేరుంది. ఇప్పుడు ఎంటర్ టైన్మెంట్ తో పాటు హర్రర్ కూడా డీల్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తి ఏర్పడింది. ఓపెనింగ్ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.