పవన్ కల్యాణ్ తన గురువు షిహాన్ హుస్సైనీ మృతి పట్ల సంతాపం తెలియజేశారు. తనకు ఎంతో క్రమశిక్షణతో మార్షల్ ఆర్ట్స్ నేర్పించారని పవన్ కల్యాణ్ తన సంతాప సందేశంలో గుర్తు చేసుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి షిహాన్ హుస్సైనీ అంటూ తన నివాళులు అర్పించారు. ఈ నెల 29న షిహాన్ ను పరామర్శించేందుకు చెన్నై వెళ్లాలలని అనుకున్నానని పవన్ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కు షిహాన్ హుస్సైనీ మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన ఫొటోస్ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
షిహాన్ హుస్సైనీ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రాకముందు ఆయనకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. చెన్నైలో నివాసం ఉంటున్న ఆయన గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారు. నటుడిగానూ పేరున్న షిహాన్ హుస్సైనీ.. దాదాపు 400 చిత్రాల్లో నటించారు.