హీరోయిన్ ఒక ఇండస్ట్రీలో క్రేజ్ తగ్గితే మరో ఇండస్ట్రీలో క్రియేట్ చేసుకుంటారు. అలాగే కీర్తి సురేష్ తెలుగులో ఫామ్ తగ్గినా ఇప్పుడు తమిళ్, బాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. బాలీవుడ్ లో పేరు తెచ్చుకోవడం సౌత్ హీరోయిన్స్ కు ఒక డ్రీమ్. ఆ కలను నిజం చేసుకుంటోందీ కీర్తి సురేష్. బేబీ జాన్ చిత్రంతో రీసెంట్ గా హిందీ మూవీలో నటించింది.
వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమా కీర్తికి మంచి గుర్తింపు తెచ్చింది. అసలే నాయికలు లేక ఇబ్బంది పడుతున్న బాలీవుడ్ కు మరో మంచి ఆప్షన్ అవుతోంది కీర్తి. తాజాగా ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ సరసన ఓ చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.