కొత్త దర్శకులనే నమ్ముతున్న అఖిల్

అఖిల్ మొదటి సినిమా తన పేరుతోనే చేశాడు. డైరెక్టర్ వి.వి. వినాయక్. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో హలో మూవీలో నటించాడు, సురేందర్ రెడ్డితో ఏజెంట్ చేశాడు. ఈ దర్శకులంతా మంచి పేరు, అనుభవం ఉన్నవారే. వాళ్లెవరూ అఖిల్ కు సక్సెస్ ఇవ్వలేకపోయారు. అందుకే ఇప్పుడు అఖిల్ చూపు కొత్త దర్శకులపై పడింది. వీరి క్రియేటివిటీనే అఖిల్ నమ్ముతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అఖిల్ వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో అఖిల్ కు జంటగా శ్రీలీల నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ లో మరో కొత్త దర్శకుడు అనిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో కొత్త డైరెక్టర్ తో సినిమాకి అఖిల్ ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది. సామజవరగమన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రైటర్స్ లో ఒకరు నందు. ఇటీవల నందు అఖిల్ కు ఓ కథ చెప్పాడట. ఈ కథ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. ఈ ప్రాజెక్ట్ కూడా కన్ ఫర్మ్ అని తెలుస్తోంది.