రామ్ చరణ్ తో పోటీ వద్దనుకుంటున్న నాని

హీరో నాని తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంద్ ఓదెలతో ప్యారడైజ్ మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా హిట్ 3 రిలీజ్ తర్వాత సెట్స్ పైకి రానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ప్యారడైజ్ గ్లింప్స్ వయలెంట్ మోడ్ లో నానిని చూపించింది. ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ ను కూడా ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఈ సినిమాని 2026లో మార్చి 26న విడుదల చేస్తానని ప్రకటించారు.

అయితే.. 2026లో మార్చి చివరి వారంలో ఉగాది, రంజాన్ వస్తున్నాయి. దాదాపు నాలుగు, ఐదు రోజుల సెలవులు ఉన్నాయి. దాంతో ఈ పీరియడ్ ని టార్గెట్ చేస్తూ తాజాగా కన్నడ సూపర్ స్టార్ తన టాక్సిక్ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశాడు. ఈ మూవీ 2026లో మార్చి 19న రిలీజ్ చేయనున్నారు. ఇక రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీని కూడా నెక్ట్స్ ఇయర్ మార్చిలో రిలీజ్ చేయనున్నారని తెలిసింది. పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్టుగా టాక్. ఈ మూవీని 2026లో మార్చి 26న రిలీజ్ అని ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ మూవీకి పోటీగా నాని ప్యారడైజ్ సినిమాను రిలీజ్ చేయడు. అందుచేత ప్యారడైజ్ పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.