“RC 16” గ్లింప్స్ రావడం కష్టమే

రామ్ చరణ్‌ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు ఓ భారీ స్పోర్ట్స్ డ్రామా మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో చరణ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ కోసం బుచ్చిబాబు మూడు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు సెట్స్ పైకి వచ్చిన తర్వాత నుంచి ఏమాత్రం గ్యాప్ లేకుండా చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నాడు. ఇటీవల ఢిల్లీలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారని సమాచారం.

ఈ మూవీ గ్లింప్స్ ను చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపించింది. బుచ్చిబాబు గ్లింప్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాడట. ఇక చరణ్‌ బర్త్ డేకు గ్లింప్ రావడం పక్కా అంటూ మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ మూవీకి ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన ఇటీవల అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం వర్క్ చేసే మూడ్ లో లేరని.. అందుచేత ఆర్ సీ 16 మూవీ గ్లింప్స్ రిలీజ్ అనేది డౌటే అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.