“జవాన్” ఫార్ములాతో అల్లు అర్జున్ మూవీ

స్టార్ హీరో అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేయబోతున్నాడు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అట్లీ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయెల్ రోల్ చేస్తాడని, అందులో పాజిటివ్ నెగిటివ్ షేడ్స్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అట్లీ షారుఖ్ ఖాన్ తో రూపొందించిన జవాన్ సినిమాలోనూ డ్యూయెల్ రోల్ లో షారుఖ్ నటించాడు. అల్లు అర్జున్ మూవీకి కూడా ఇదే ఫార్ములాను డైరెక్టర్ అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఉగాదికి అల్లు అర్జున్, అట్లీ కాంబో మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఆమె కాకుండా మరో నలుగురు హీరోయిన్స్ ఉంటారని..ఆ నలుగురులో ఇద్దరు ఇండియన్ యాక్ట్రెస్ కాగా మిగిలిన ఇద్దరు హాలీవుడ్ హీరోయిన్స్ అని సమాచారం. ఈ మూవీని ఫాస్ట్ గా కంప్లీట్ చేసి నెక్ట్స్ ఇయర్ ఎండింగ్ లోపు రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.