‘నాలో ఏదో..’ చెప్పలేని ఫీలింగ్ అంటున్న కొత్త జంట

ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ దాకా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమ ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ కు రెడీ అయ్యింది. ‘నాలో ఏదో..’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఈ నెల 26న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సునీల్ కశ్యప్ “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాకు సూపర్ హిట్ ట్యూన్స్ అందించారు. నాలో ఏదో సాంగ్ కు శ్రోజీ లిరిక్స్ రాయగా..దినకర్ కల్వల, అదితి భావరాజు పాడారు. కొత్తజంట తమ ఫీలింగ్స్ షేర్ చేసుకునే సందర్భంలో ఈ పాట రూపొందించినట్లు తెలుస్తోంది.

“సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.