పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో రాబోతున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాకు గత కొన్ని రోజులుగా సందీప్ రెడ్డి వంగ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైమ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలు ఒకదానిని మించి మరొకటి సక్సెస్ సాధించడంతో స్పిరిట్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
స్పిరిట్ చిత్రాన్ని ఉగాదికి స్టార్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. ఇందులో నటించే విలన్స్ అంటూ సైఫ్ ఆలీఖాన్, కరీనా కపూర్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. ఇంత వరకు క్లారిటీ లేదు. ఆల్రెడీ సినిమాకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ అవ్వడం.. పాటలు రికార్డ్ చేయడం జరిగింది. ఇందులో కథ, కథనం ఇంత వరకు చూడని విధంగా.. ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఉగాదికి స్టార్ట్ అయ్యే ఈ సినిమాని ఏమాత్రం గ్యాప్ లేకుండా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నారు.