ఎస్ఎస్ఎంబీ 29 – సీక్రెట్ చెప్పిన పృథ్వీరాజ్ సుకుమారన్

సూపర్ స్టార్ మహేష్‌ బాబు, టాప్ డైరెక్టర్ రాజమౌళి కాంబో మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ఒడిశ్సాలో మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. త్వరలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు మహేష్‌ బాబు, ప్రియాంకా చోప్రా, పృధ్వీరాజ్ సుకుమారన్ ఉన్న విజువల్స్, ఫోటోలు లీకవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇన్ని రోజులు సీక్రెట్ గా ఉంచిన పృధ్వీరాజ్ అసలు విషయం బయటపెట్టాడు. ఈ ప్రాజెక్ట్ లో సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నానని.. త్వరలో ఈ సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారని.. ఆ ప్రెస్ మీట్ లో తను కూడా పాల్గొంటానని చెప్పారు. అలాగే ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి కూడా ఈ సినిమా గురించి స్పందించారు. ఇంత వరకు ఇండియన్ సినిమా పై రాని కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని చెప్పారు. అలాగే ఈ మూవీకి సంగీతం అందించడం ఛాలెంజింగ్ గా ఉందని.. కొత్త సౌండింగ్ తో ఈ మూవీ ఉంటుందని చెప్పడంతో ఈ పాన్ వరల్డ్ మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది.