ఈనెల 28న రిలీజ్ కాబోతున్న “పొలిమేర” దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ ఫస్ట్ మూవీ “28°C”

బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మూవీ ఫ్రాంఛైజీ “పొలిమేర”, “పొలిమేర 2” చిత్రాలను రూపొందించి దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నారు డా. అనిల్ విశ్వనాథ్. థ్రిల్లర్ సినిమాలు రూపొందించడంలో తన ప్రత్యేకత చూపించిన ఈ దర్శకుడు తన మొదటి చిత్రంగా ఓ మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ రూపొందించాడు. ఆ చిత్రమే “28°C”. ఈ సినిమాలో నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా నటించారు. “28°C” చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. “28°C” సినిమా ఈ నెల 28న థియేటర్స్ లోకి రాబోతోంది.

ఈ రోజు ఈ సినిమా నుంచి ‘చెలియా చెలియా..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘చెలియా చెలియా..’ లిరికల్ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్టర్ శ్రావణ్ భరద్వాజ్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేయగా, కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ అందించారు. సింగర్ రేవంత్ ఆకట్టుకునేలా పాడారు. ‘చెలియా చెలియా..’ పాట మంచి లవ్ ఫీల్ తో సాగుతూ మళ్లీ మళ్లీ వినేలా ఉంది. డిఫరెంట్ స్టోరీ స్క్రీన్ ప్లేతో మనసును తాకే భావోద్వేగాలు కలిపి ఆద్యంతం సాగే అద్భుతమైన ప్రేమ కథా మూవీగా “28°C” ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. టెంపరేచర్ కీ రోల్ ప్లే చేయడం ఈ కథలోని ప్రత్యేకత.