నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’

ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ హిట్ ఫిల్మ్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్వత్ మారిముత్తు రూపొందించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మించింది.

గత నెల 21న థియేటర్స్ లోకి వచ్చిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’ సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను దక్కించుకుంది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్‌’ సినిమా మీదున్న క్రేజ్ తో నెట్ ఫ్లిక్స్ లోనూ టాప్ లో ట్రెండ్ కానుంది.