నాగచైతన్య తండేల్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆయన తన నెక్ట్స్ మూవీని విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో చేస్తున్నాడు. ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్య ఈ సినిమా తర్వాత ప్రాజెక్ట్ కూడా సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు కిషోర్ తో నాగచైతన్య సినిమా చేసేందుకు అంగీకరించాడు.
అయితేే కొత్త దర్శకులతో నాగ చైతన్య గతంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. అంటే ఫ్లాప్స్ చూశాడు. అయినా మరోసారి న్యూ డైరెక్టర్ తో రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటిదాకా నలుగురు కొత్త దర్శకులతో సినిమాలు చేశాడు నాగ చైతన్య. ఆ నలుగురూ ఆయనకు హిట్ ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మరోసారి కొత్త దర్శకుడుతో సినిమా అంటే.. రిస్కే అనే టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ కిషోర్ చెప్పిన కథ బాగా నచ్చి నాగ చైతన్య ఓకే అన్నాడట. త్వరలోనే ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం.