తాగితే తందానా వద్దు

కొందరు తాగిన తర్వాత చేసే హంగామా మామూలుగా ఉండదు. ఆల్కహాల్ ఇచ్చే హై లో అతిగా ఆలోచిస్తూ లేనిపోని ఇబ్బందుల్లో పడుతుంటారు. అందుకే డోంట్ డ్రింక్ అండ్ థింక్ అనే పాయింట్ ను చెబుతూ రూపొందిన సినిమా “తాగితే తందానా”. ఈ చిత్రంలో త్రిగుణ్, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బీరం సుధాకర రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో సిమ్రాన్ గుప్తా హీరోయిన్. రియా మరో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇటీవలే సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ పొందిన “తాగితే తందానా” సినిమా ఏప్రిల్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. క్రైమ్ కామెడీ జానర్ లో రూపొందిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే “తాగితే తందానా” సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు.