స్టార్స్ కు అలాంటి విషయాలు తెలియకపోవచ్చు – ఆర్జీవీ

‘ఒక సంస్థకు గానీ ప్రాడక్ట్ లకు గానీ ప్రచారం చేస్తుంటారు స్టార్స్. అయితే ఆ సంస్థలు, ఉత్పత్తులు చట్టపరమైనవా లేదా అని విషయంలో యాక్టర్స్ కు అవగాహన ఉండకపోవచ్చు. ఈ విషయాలపై స్టార్స్ కు సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలి. అంతేగానీ ఒక్కసారిగా చర్యలు తీసుకోవడం సరికాదు..’ అన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేస్తున్నారనే విషయంలో పలువురు టాలీవుడ్ స్టార్స్, యాంకర్స్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ తన కొత్త సినిమా “శారీ” ట్రైలర్ లాంఛ్ లో స్పందించారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – కల్యాణ్ జువెల్లర్స్ కు అమితాబ్ బచ్చన్, నాగార్జున యాడ్స్ చేస్తుంటారు. వారికి ఆ సంస్థ లీగలా , ఇల్లీగలా అనేది తెలియకపోవచ్చు. యాక్టర్స్ దగ్గరకు ఎంతోమంది వచ్చి తమ కంపెనీలకు ప్రమోషన్ చేయమంటారు. అవి చట్టపరమైనవా కావా అనేది వారికి తెలిసి ఉండదు. ఈ విషయంలో యాక్టర్స్ కు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు అవగాహన కల్పించాలి. ఇలా వెంటనే చర్యలు తీసుకోవడం సరికాదు. అన్నారు.