బాలకృష్ణ, పవన్ పోటా పోటీ

బాలకృష్ణ నటిస్తోన్న కొత్త మూవీ అఖండ 2. ఈ భారీ చిత్రాన్ని డైరెక్టర్ బోయపాటి తెరకెక్కిస్తున్నారు. అఖండ చిత్రానికి సీక్వెల్ గా అఖండ 2 రాబోతుంది. దీనికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. బోయపాటి ఈ సినిమాను చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి ఓజీ. ఈ చిత్రానికి సుజిత్ డైరెక్టర్. ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు ఈ సెప్టెంబర్ లో ఓజీ మూవీని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. వీరమల్లు మే 9న రిలీజ్ కానుంది. ఆతర్వాత సెప్టెంబర్ లో ఓజీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఫిక్స్ చేశారని టాక్. దీంతో బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ వర్సెస్ పవన్ అనే పోటీ నెలకొంది.