యూకే పార్లమెంట్ లో లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. యూకే పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో నిన్న రాత్రి ఆయనకు సత్కారం చేశారు. చిరంజీవి ఈ అవార్డ్ తీసుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ కుటుంబ సభ్యులు అయినందుకు గర్వంగా ఉందంటూ పవర్ స్టార్ పవన్, సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. హీరోగా, సామాజిక సేవకుడిగా నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ అందించారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ మెగాస్టార్ కు ఈ అవార్డ్ అందించిది.