“ఆర్ సీ 16” టైటిల్, టీజర్ కు ముహుర్తం ఫిక్స్

రామ్ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ సీ 16. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో చరణ్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీలో చరణ్‌ ఆట కూలీగా నటిస్తున్నట్లు తెలిస్తోంది.

ఆర్ సీ 16 మూవీ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేశారని తెలిసింది. మార్చి 27న చరణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ మూడు పాటలు రికార్డింగ్ కూడా చేశారు. ఇందులో చరణ్‌ ను ఇంతకుముందు ఎవరూ చూపించని విధంగా చూపించబోతున్నాడట బుచ్చిబాబు. ఉప్పెన నుంచి దాదాపు మూడు సంవత్సరాలు చరణ్‌ కోసం వెయిట్ చేశాడు. అప్పటి నుంచి కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నాడు. గేమ్ ఛేంజర్ నిరాశపర్చి నేపథ్యంలో ఈ మూవీపై చరణ్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు.