విజయ్ సేతుపతిని “బెగ్గర్”గా చూపించనున్న పూరి

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమిళ నటుడు విజయ్ సేతుపతితో తన నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. పూరి నెక్ట్స్ మూవీకి పలువురు తెలుగు హీరోల పేర్లు వినిపించినా..ఈ ఊహించని కాంబో సెట్ చేసుకున్నాడు. విజయ్ సేతుపతిని సింగిల్ సిట్టింగ్ లో స్టోరీ చెప్పి ఒప్పించాడట పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ను ఉగాది రోజున చేయాలి అనుకున్నారు. అయితే విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ రెడీ చేసి ఈ సినిమాని అనౌన్స్ చేయడానికి మరికొంత టైమ్ పట్టేలా ఉండటంతో ఉగాదికి మూవీ ప్రకటన వాయిదా వేశారట. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ప్రాజెక్ట్ గా చేస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి బెగ్గర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పరిశీలిస్తున్నారని తెలిసింది.