పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ లో మరచిపోలేని చిత్రాల్లో ఒకటి కల్కి. నాగ్ అశ్విన్ ఈ మూవీని తెరకెక్కించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, యూనివర్శిల్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. దీంతో కల్కి 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా..? ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు.
కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ తక్కువుగా ఉందనే కామెంట్లు వినిపించాయి. ఈసారి కల్కి 2 లో ప్రభాస్ భైరవ, కర్ణ పాత్రలను ఎక్కువుగా ఉండేలా డిజైన్ చేసాన్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ ఇయర్ లోనే మూవీ స్టార్ట్ అవుతుందని, ప్రభాస్ డేట్స్ అన్నీ చూసుకుని ప్లాన్ చేస్తామని ఆయన తెలిపారు. అయితే రిలీజ్ డేట్ గురించి ఇప్పుడే మేకర్స్ ఏమీ చెప్పలేకపోతున్నారు. అనుకున్నట్టుగా ఈ ఇయర్ లో కల్కి 2 సెట్స్ పైకి వస్తే.. నెక్ట్స్ ఇయర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్.