సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “కిల్లర్ ఆర్టిస్ట్”. ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. “కిల్లర్ ఆర్టిస్ట్” మూవీ ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తుండటం విశేషం. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ – “కిల్లర్ ఆర్టిస్ట్” మూవీకి మా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. మా సినిమా మీ చేతుల్లోకి వచ్చే టైమ్ వచ్చేసింది. ఫ్రైడే నుంచి మా మూవీ మీది. చిత్రీకరణ చేస్తున్నంత వరకు సినిమా బాగా రావాలని ప్రయత్నించాం. ఇప్పుడు ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందనే టెన్షన్ పడుతున్నాం. ఈ సినిమా ఫలితం మీద మా హీరో హీరోయిన్స్ డైరెక్టర్ ఇలా..చాలామంది ఫ్యూచర్ ఆధారపడి ఉంది. అందరూ బాగా వర్క్ చేశారు. మా డైరెక్టర్ రతన్ పని రాక్షసుడు. తనకు కావాల్సిన ఔట్ పుట్ తీసుకుంటాడు. హీరో సంతోష్ , హీరోయిన్ క్రిషేక, సోనియా..వీళ్లందరికీ మంచి పేరొస్తుంది. డైరెక్టర్ రతన్ రిషి కూడా వరుసగా సినిమాలు దక్కించుకుంటాడని నమ్ముతున్నా. చిత్రంతో సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తారు. మా మూవీ ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు. సినిమాకు కూడా సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.