రజినీకాంత్, నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, అమీర్ ఖాన్ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న మూవీ కూలీ. ఈ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఓటీటీలో ఇంతవరకు ఓ తమిళ సినిమాకు, రజినీకాంత్ సినిమాకు జరగనంత డీల్ కుదిరింది. దాదాపు 120 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో కూలీ ఓటీటీ రైట్స్ దక్కించుకుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
రిలీజ్ డేట్ విషయంలోనే కూలీ సినిమాకు క్లారిటీ రావడం లేదు. మే 1 నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్ ఆగస్టు 15కు మారింది. ఇప్పుడు ఈ డేట్ కూడా కన్ఫర్మ్ కాదని అంటున్నారు. ఆగష్టు 14న ఎన్టీఆర్, హృతిక్ కాంబో మూవీ వార్ 2 రిలీజ్ అవుతుండడంతో దాంతో పోటీపడకుండా కూలీ సినిమా ఆగష్టులోనే వారం గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమా కోలీవుడ్ కు ఫస్ట్ 1000 కోట్ల సినిమా అవుతుందనే అంచనాలు ఉన్నాయి.