దర్శకుడు పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ తర్వాత ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అనేది ఇప్పటిదాకా సస్పెన్స్ గానే ఉంది. మెగాస్టార్ నుంచి హీరో గోపీచంద్ దాకా చాలామంది హీరోల పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడొక ఊహించని కాంబోతో పూరి తన కొత్త సినిమా చేస్తున్నట్లు న్యూస్ సర్క్యూలేట్ అవుతోంది. కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతితో దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త మూవీ చేస్తున్నాడట.
రీసెంట్ గా విజయ్ సేతుపతికి పూరి జగన్నాథ్ స్టోరీ నెరేట్ చేశాడని, ఆ కథ విజయ్ సేతుపతికి బాగా నచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా చేసేందుకు విజయ్ సేతుపతి ఆసక్తి చూపిస్తున్నాడట. డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఆర్టిస్టుగా, హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. పూరితో ఆయన సినిమా చేస్తుండటం మూవీ లవర్స్ లో ఆసక్తి కలిగించే విషయమే.