అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సిఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ పక్కనపెట్టి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.ఈ ప్రాజెక్ట్ ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఈ మూవీని కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించేదుకు ప్లాన్ చేస్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక అతి త్వరలోనే ఈ క్రేజీ మూవీ అనౌన్స్ మెంట్ వస్తుందని.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపించేది.
అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి సన్ పిక్చర్స్ తప్పుకుంటుందని లేటెస్ట్ న్యూస్. అల్లు అర్జున్, అట్లీ సినిమాకి భారీ బడ్జెట్ అవసరం. దాదాపు వెయ్యి కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని అంచనా వేశారట. అయితే.. ముందు ఓకే అని చెప్పినా తర్వాత ఎందుకనో సన్ పిక్చర్స్ ఆలోచనలో పడిందట. కొత్తగా జీ స్టూడియోస్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కానుందని తెలిసింది. జీ స్టూడియోస్ ఉంటే.. సన్ పిక్చర్స్ ఉండదు. అంటే ఈ లెక్కన సన్ పిక్చర్స్ తప్పుకున్నట్టే అని ప్రచారం జరుగుతోంది.