“కాలమేగా కరిగింది” ట్రైలర్ రివ్యూ – ఫణి, బిందు ప్యూర్ లవ్ స్టోరీ

తప్పొప్పులు తెలియనిది, మంచీ చెడు ఎరుగని స్వచ్ఛమైనది టీనేజ్ లవ్. ఈ టీనేజ్ ప్రేమను పొయెటిక్ గా చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది “కాలమేగా కరిగింది” సినిమా. ఈ చిత్రంలో వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు. శింగర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. “కాలమేగా కరిగింది” సినిమా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

స్కూల్ లైఫ్ లవ్ ను చూపిస్తూ “కాలమేగా కరిగింది” ట్రైలర్ ప్లెజెంట్ గా సాగింది. ఆ వయసులో కలిగే స్వచ్చమైన ప్రేమను ఈ మూవీలో బ్యూటిఫుల్ మ్యూజిక్ తో, మంచి కవితాత్మకమైన మాటలతో ఆవిష్కరించారు దర్శకుడు శింగర మోహన్. ఫణి, బిందు చిన్నప్పటి ప్రేమ కథ పెద్దయ్యాక ఎలాంటి మలుపులు తిరిగింది. ఫణి తన ప్రేమ జ్ఞాపకాలను వెతుక్కుంటూ చిన్నప్పటి స్కూల్ కు, తమ ఊరికి ఎందుకు తిరిగొచ్చాడు అనేది ట్రైలర్ లో ఆసక్తిని కలిగించింది. అరవింద్ ముదిగొండ, నోమిన తార తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు.