క్రేజీ లైనప్ చేసుకుంటున్న కిరణ్ అబ్బవరం

రాజా వారు రాణి గారు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్‌ అబ్బవరం మొదటి చిత్రంతోనే ఘన విజయం సాధించాడు. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా కిరణ్ కు మరింత కమర్షియల్ సక్సస్ అందించింది. ఇటీవల క అనే సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా దిల్ రూబా అంటూ యువ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. దీంతో కిరణ్ నెక్ట్స్ మూవీస్ ఏంటనే ఆసక్తి మూవీ లవర్స్ లో ఏర్పడుతోంది.

తనకు ఇప్పుడున్న క్రేజ్ కొనసాగించేలా సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఆయన తన బ్లాక్ బస్టర్ మూవీ క కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా మరో మూడు సినిమాలు ఓకే చేశాడు. వీటికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు సమాచారం. కిరణ్ అబ్బవరం క్రేజీ లైనప్ లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో ఓ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మంచి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సెన్సబుల్ మూవీస్ చేసే శ్రీకాంత్ అడ్డాలతో కిరణ్ హీరోగా మూవీ వస్తే అది ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అవుతుంది.