మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమా చేయనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో అనిల్ రావిపూడి.. చిరంజీవితో సినిమా చేయాలి అనుకుంటున్నాడు. అది ఇప్పటికి సెట్ అయ్యింది. వెంకీతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా తీయడం.. అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో అనిల్ నెక్ట్స్ మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది. చిరుకు స్టోరీ లైన్ చెప్పి ఓప్పించిన తర్వాత వైజాగ్ వెళ్లి అక్కడ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. అయితే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి తెలిసినప్పటి నుంచి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనేది మెగా ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయ్యింది.
ఆల్రెడీ ఫస్టాఫ్ కంప్లీట్ చేసి లాక్ చేశాడట. ఫస్టాఫ్ చిరుకు చెబితే అదిరింది అని చెప్పారట. ప్రస్తుతం అనిల్ రావిపూడి సెకండాఫ్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటే.. అనిల్ రావిపూడి ఎప్పుడూ తీస్తున్నట్టుగానే ఈ సినిమాను కూడా ఎంటర్ టైనింగ్ గా తీయబోతున్నాడట. ఆయన బలం కామెడీ. ఎంటర్ టైనింగ్ గా సినిమాలు తీయడంలో ఆయన దిట్ట. ఆ స్టయిల్ నే ఈ సినిమాను కూడా తీయబోతున్నాడట. ఏప్రిల్ చివర్లో కానీ మేలో కానీ ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా స్టార్ట్ చేయనున్నారు. ఆరు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసి మళ్ళీ సంక్రాంతి పండగకి విడుదల చేయాలి అనేది ప్లాన్.