“తండేల్” డైరెక్టర్ తో రామ్ సినిమా

హీరో రామ్ ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి డైరెక్టర్ మహేశ్ బాబుతో సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే.. ఈ సినిమా తర్వాత రామ్ సినిమా ఎవరితో అనేది కన్ ఫర్మ్ కాలేదు. చందూ మొండేటితో సినిమా చేయనున్నాడని ఓ వార్త లీకైంది. తండేల్ మూవీతో సక్సెస్ సాధించిన చందూ మొండేటి సూర్య కోసం ఓ కథ రెడీ చేశాడు. ఆ కథ సూర్యకు చెప్పడం. సూర్య సినిమా చేసేందుకు ఒప్పుకోవడం కూడా జరిగిపోయింది.

సూర్య ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుచేత ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని చందూ మొండేటి ఫిక్స్ అయ్యాడట. ఇటీవల రామ్ కు చందూ ఓ స్టోరీ లైన్ చెప్పాడు. ఆ ఐడియా రామ్ కు నచ్చిందట..పైగా చందూతో వర్క్ చేయడానికి రామ్ ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. రామ్, చందూ కాంబో మూవీని గీతా ఆర్ట్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం రామ్ చేస్తోన్న మూవీకి ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత చందూ మొండేటితో రామ్ సినిమా ఉంటుందని సమాచారం.