పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు సినిమా మే9న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ కొత్త డేట్ ను ఈరోజు హోలీ పండుగ సందర్భంగా అనౌన్స్ చేశారు. ఈ నెల 28న హరి హర వీరమల్లు సినిమా థియేటర్స్ లోకి రావాల్సిఉంది. అయితే ఇంకా షూటింగ్ పూర్తికానందున సినిమా విడుదల వాయిదా వేశారు. మే 9న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పవన్ షెడ్యూల్ ఒకటి పెండింగ్ లో ఉంది. ఇది పూర్తయితే గానీ ఆ మే 9న కూడా సినిమా రిలీజ్ అవుతుందని చెప్పలేని పరిస్థితి.
మరోవైపు చిరంజీవి విశ్వంభర సినిమా మే 9న రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు పవన్ హరి హర వీరమల్లు మే9న వస్తుందంటే విశ్వంభర రానట్లే లెక్క. దీంతో మెగాస్టార్ సినిమాకు కొత్త డేట్ వెతకాల్సిందేనని తెలుస్తోంది. పవన్ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చినందున నితిన్ రాబిన్ హుడ్ కు మార్చి 28న రిలీజ్ లైన్ క్లియర్ అయినట్లే.