మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఆయనకు యూకే పార్లమెంట్ లోని హౌస్ ఆఫ్ కామన్స్ లో సత్కారం చేయనున్నారు. నాలుగు దశాబ్దాలుగా సినీ రంగ విజయంలో భాగస్వామిగా ఆయన చేసిన కృషికి, సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ సత్కారం చేయబోతున్నారు.
ఇదే వేదిక మీద బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవికి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ అందించనుంది. ఇప్పటికే మన దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ లతో పాటు పలు ప్రతిష్టాత్మక అవార్డులూ అందుకున్నారు చిరంజీవి. ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. త్వరలోనే విశ్వంభర రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించబోతున్నారు.