నటీనటులు – కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, క్యాతీ డేవిసన్, సత్య, తదితరులు
టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – ప్రవీణ్.కేఎల్, సినిమాటోగ్రఫీ – డానియేల్ విశ్వాస్, మ్యూజిక్ – సామ్ సీఎస్, నిర్మాతలు – రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రచన, దర్శకత్వం – విశ్వ కరుణ్
రంగుల పండుగ హోలీ రోజున కలర్ ఫుల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకొచ్చింది దిల్ రూబా సినిమా. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ తో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షించింది. మూవీ మీద ఉన్న అంచనాలను థియేటర్స్ లో దిల్ రూబా అందుకుందా లేదా రివ్యూలో చూద్దాం
కథేంటంటే
మ్యాగీ (క్యాతీ డేవిసన్)ని హార్ట్ ఫుల్ గా లవ్ చేస్తాడు సిద్ధు(కిరణ్ అబ్బవరం). అనుకోని పరిస్థితుల్లో మ్యాగీ, సిద్ధు విడిపోవాల్సివస్తుంది. మరోవైపు సిద్ధు కుటుంబంలోనూ ఇబ్బందులు మొదలవుతాయి. లవ్ లో ఫెయిలైన తన కొడుకు కొత్త ప్లేస్ కు వెళ్తే బాగుంటాడని భావించిన తల్లి సిద్ధును బెంగళూరు పంపిస్తుంది. అక్కడ ఓ ప్రమాదంలో అంజలి(రుక్సర్ థిల్లాన్)ను కాపాడతాడు సిద్ధు. తనను కాపాడిన సిద్ధును ప్రేమిస్తుంది అంజలి. మొదట్లో వెంటపడినా అంజలిని పట్టించుకోని సిద్ధు..ఆ తర్వాత తను కూడా ఆమెను ప్రేమిస్తాడు. ఓ సందర్భంలో అంజలి, సిద్ధు మధ్య కాన్ ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. సిద్ధు లవ్ ఫెయిలైనప్పటి నుంచి సారీ, థ్యాంక్స్ చెప్పడం మర్చిపోతాడు. ఆ రెండు పదాలకు తన జీవితంలో చోటు లేదని భావిస్తాడు. సిద్ధును ఓ సందర్భంలో సారీ చెప్పమంటుంది అంజలి. సిద్ధు ఒప్పుకోడు. ఈ పరిస్థితుల్లో అంజలి, సిద్ధు తిరిగి ఎలా ఒకటయ్యారు. వీరి ప్రేమకు ఎక్స్ లవర్ మ్యాగీ ఎలా సపోర్ట్ చేసింది అనేది తెరపై చూడాల్సిన కథ.
ఎలా ఉందంటే
ఎక్స్ లవర్ వచ్చి తను ప్రేమించి విడిపోయిన అబ్బాయి ప్రెజెంట్ లవ్ ను కలిపితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. ఎక్స్ లవర్ అనగానే శత్రువులా చూడకుండా వారితోనూ స్నేహంగా ఉండొచ్చనే ఎమోషనల్ పాయింట్ ను దిల్ రూబాలో చూస్తాం. ఇప్పటిదాకా ఏ ప్రేమ కథలోనూ ఇలాంటి డిఫరెంట్ పాయింట్ ను టచ్ చేయలేదు. ఈ కథకు హీరో క్యారెక్టరైజేషన్ ను హైలైట్ గా ఉపయోగిస్తూ దిల్ రూబాను రూపొందించారు దర్శకుడు విశ్వకరుణ్. సారీ, థ్యాంక్స్ చెప్పడంలో అర్థం లేదని, ఆ మాటల్ని దుర్వినియోగం చేస్తున్నామంటూ కొత్త ఫిలాసఫీ చెప్పాడు దర్శకుడు. కిరణ్ అబ్బవరం సిద్ధు పాత్రలో చేసిన ఎనర్జిటిక్ పర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది. యూత్ ఫుల్ యాక్షన్ లవ్ స్టోరీగా దిల్ రూబా ఫస్ట్ సీన్ నుంచి ఆకట్టుకుంటుంది. మ్యాగీ, సిద్ధు దూరమవుతున్న సీన్ నుంచే సినిమా మీద ఆసక్తి మొదలవుతుంది. సిద్ధు బెంగళూరు వెళ్లడం, అంజలి పరిచయం, వారి లవ్ స్టోరీ, ఆ తర్వాత మొదలయ్యే కాన్ ఫ్లిక్ట్ కథను ఫాస్ట్ ఫేజ్ లో తీసుకెళ్తూ ఎక్కడా డీవియేట్ కాకుండా చేస్తాయి. హీరో కిరణ్ అబ్బవరం ప్రెస్ మీట్స్ లో చెప్పినట్లు దిల్ రూబా మ్యాజిక్ మూవ్ మెంట్స్ మీద వెళ్తుంది. కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటాయి. ఈ యాక్షన్ సీక్వెన్సుల కోసం కిరణ్ పడిన కష్టం స్క్రీన్ మీద తెలుస్తుంటుంది.
హీరో కిరణ్ అబ్బవరంకు పర్ ఫార్మెన్స్ పరంగా మరో మెట్టు పైకి ఎక్కించిన సినిమా దిల్ రూబా. ఆయన సాంగ్స్ లో చేసిన డ్యాన్సులు, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ లో చేసిన పర్ ఫార్మెన్స్, డైలాగ్స్ చెప్పిన విధానం..అన్నీ మెస్మరైజ్ చేస్తాయి. కిరణ్ తన గత సినిమాలతో చూస్తే స్టైలిష్ గా కనిపించిన చిత్రం దిల్ రూబా. మ్యాగీగా క్యాతీ డేవిసన్, అంజలిగా రుక్సర్ థిల్లాన్ తమ క్యారెక్టర్స్ కు బాగా సెట్ అయ్యారు. టెక్నికల్ గా చూస్తే సుధీర్ ప్రొడక్షన్ డిజైన్, డానియేల్ విశ్వాస్ కలర్ పుల్ సినిమాటోగ్రఫీ, సామ్ సీఎస్ మ్యూజిక్ మూవీకి ఆకర్షణగా నిలుస్తాయి. ఆఫ్ స్క్రీన్ హీరో ఆఫ్ దిల్ రూబా సామ్ సీఎస్ అని చెప్పొచ్చు. ఆయన చేసిన పాటలు, బీజీఎం మూవీకి లైఫ్ ఇచ్చాయి.
దిల్ రూబా – మ్యాజికల్ లవ్ స్టోరీ
రేటింగ్ 3.5/5