డైరెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ తో డిజాస్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో అనేది సెట్ కాలేదు. పూరి జగన్నాథ్ సినిమా చేస్తున్నాడంటూ గోపీచంద్, బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్, బాలకృష్ణ ఇలా కొందరు హీరోల పేర్లు వినిపించాయి. తాజాగా అఖిల్ తో పూరి సినిమా అని ప్రచారమవుతోంది. అయితే ఇంకా ఏ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదని.. గోపీచంద్ తో సినిమా కన్ ఫర్మ్ అయ్యేట్టు ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
పూరి దగ్గర ఎన్నో కథలు ఉన్నాయి. ఇప్పుడు పక్క ప్లానింగ్ తో ఎంతో హామ్ వర్క్ చేసి నాలుగు కథలు రెడీ చేశాడట. ఈ నాలుగు కథలతో హీరోలను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడట. పూరి గురించి కోన వెంకట్ స్పందించాడు. పూరి జగన్నాథ్ ఇంత కంటే వరస్ట్ పీరియడ్ ని చూశాడని.. ఆయనలో బోల్డెంత టాలెంట్ ఉందని.. ఖచ్చితంగా పూరి ఈజ్ బ్యాక్ అనేలా బ్లాక్ బస్టర్ అందిస్తాడని కోన వెంకట్ గట్టి నమ్మకంతో చెప్పాడు. పూరి దగ్గర ఉన్న నాలుగు కథల్లో ఏ కథతో సినిమా చేస్తే బాగుంటుందో ఆలోచిస్తున్నాడట. ఈలోగా హీరో, ప్రొడ్యూసర్ కూడా సెట్ కావాల్సిఉంది.