ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకునేందుకు ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె, సీజన్ 4. సుమ కనకాల హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సుమతో పాటు నటుడు జీవన్ కుమార్ చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కెలో తనవంతు వినోదాన్ని జోడిస్తున్నారు.
అమర్ దీప్-అర్జున్, దీపికా రంగరాజు-సమీరా భరద్వాజ్, సుప్రిత-యాదమ్మ రాజు, ప్రషు-ధరణి మరియు విష్ణుప్రియా-పృథ్వీ జోడీ రుచికరమైన వంటకాలు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. తెలుగింటి వంటలతో పాటు సర్ ప్రైజ్ చేసే క్రియేటివ్ వంటకాలు ప్రతి ఎపిసోడ్ లో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 4 అందిస్తోంది.