తమన్నా ల(స్ట్)వ్ స్టోరీ ముగిసింది

లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో కలిసి నటించి పర్సనల్ గా దగ్గరయ్యారు హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ. ఈ సిరీస్ స్ట్రీమింగ్ తర్వాత పలు సందర్భాల్లో వీరు కలిసి పబ్లిక్ గా కనిపించారు. తమన్నా, విజయ్ వర్మ లవ్ స్టోరీ గురించి మీడియాలోనూ ప్రముఖంగా ప్రచారమైంది. ఒక టైమ్ లో తమన్నా విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న విషయాన్ని ఒప్పుకుంది. ఇప్పుడీ లవ్ స్టోరీ బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది.

సెలబ్రిటీలు తమ లైఫ్ లో బ్రేకప్ అయితే ఫస్ట్ చేసే పని సోషల్ మీడియాలో తమ ఫొటోస్ డిలీట్ చేయడం, స్టేటస్ మార్చుకోవడం, తమన్నా, విజయ్ వర్మ కూడా ఇదే పనిచేశారు. తమ సోషల్ మీడియా అక్కౌంట్స్ లో కలిసి తీసుకున్న ఫొటోస్ తొలగించారు. దీంతో వీరి బ్రేకప్ వార్తలు బాలీవుడ్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ బ్రేకప్ ఇంత వైరల్ అవుతున్నా తమన్నా, విజయ్ వర్మ స్పందించకపోవడం విశేషం.