సందీప్ ఆశలన్నీ ఆ సినిమా పైనే..!

సందీప్ కిషన్ టాలెంటెడ్ యాక్టర్ కానీ కాలం కలిసి రావడం లేదు. ఎన్ని ప్రయత్రాలు చేసినా ఫలించడం లేదు. మజాకా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ నిరాశే ఎదురైంది. మజాకా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.. సందీప్ కెరీర్ లో మరో ప్లాప్ మూవీగా నిలిచింది. తమిళ్ స్టార్ విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్ లో సందీప్ కిషన్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే..సందీప్ కిషన్ ఇప్పుడు ఫ్యామిలీ మేన్ 3, సుబ్బు అనే రెండు వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. తెలుగులో హీరోగా నటించే సినిమా కోసం కథాచర్చలు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు సందీప్ ఆశలన్నీ సంజయ్ డైరెక్షన్ లో చేసే సినిమా పైనే ఉన్నాయి. మరి.. ఈ మూవీ అయినా సందీప్ కి ఆశించిన సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.