ఎన్టీఆర్, హృతిక్ “నాటు నాటు”..!

ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్, చరణ్‌.. వీరిద్దరూ కలిసి నాటు నాటు సాంగ్ కు చేసిన డ్యాన్స్ వేరే లెవెలో ఉండడంతో అందరికీ నచ్చేసింది. ఆస్కార్ అవార్డ్ ను సైతం దక్కించుకుని చరిత్ర సృష్టించింది. అయితే.. నాటు నాటు లాంటి మ్యాజిక్కే చేయాలని ట్రై చేస్తున్నాడు వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ. సౌత్ స్టార్ ఎన్టీఆర్, నార్త్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తోన్న వార్ 2 పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ మంచి డ్యాన్సర్స్. ఇక వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే.. ఇక ఆ సాంగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

యశ్ రాజ్ స్టూడియోస్ లో ఎన్టీఆర్, హృతిక్ పై సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. 500 మంది డ్యాన్సర్ తో ఈ సాంగ్ ను షూట్ చేస్తుండడం విశేషం. నాటు నాటు సాంగ్ ను మించేలా ఈ సాంగ్ ఉంటుందని టాక్ వస్తుండడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. ఈ సాంగే కాదు.. ఎన్టీఆర్, హృతిక్ ల పై వచ్చే యాక్షన్స్ సీన్స్ కూడా వావ్ అనేలా ఉంటాయని సమాచారం. ఇక రిలీజ్ విషయానికి వస్తే.. ఆగష్టు 14న వార్ 2 రిలీజ్ చేయాలని ఎప్పుడో డేట్ ఫిక్స్ చేశారు కానీ.. ఇప్పుడు ప్లాన్ మారిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.