ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసిన మరో హిట్ మూవీ దేవర. అయితే ఈ మూవీకి ఫస్ట్ డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దేవర కు వచ్చిన నెగిటివ్ టాక్ తో దేవర 2 ఉండదేమో అని ప్రచారం జరిగింది కానీ..దేవర 2 సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దేవర పార్ట్-2 స్క్రిప్ట్ వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుందని.. ముఖ్యంగా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారని తెలిసింది. బాలీవుడ్ ఆడియన్స్ ని మరింతగా ఆకట్టుకోవడం కోసం ఈ మూవీలో హీరో రణ్ వీర్ సింగ్ తో ఓ పాత్ర చేయించేలా ప్లాన్ చేస్తున్నారట.
రణ్ వీర్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తన తర్వాత దేవర 2ను స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. జాన్వీ పాత్ర పార్ట్ 1 లో అంతగా చూపించలేదు.. ఇప్పుడు పార్ట్ 2 లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలిసింది. ప్రచారంలో ఉన్నట్టుగా దేవర 2 లో రణ్ వీర్ సింగ్ నటిస్తే నార్త్ బెల్ట్ లో దేవర 2కు మరింత క్రేజ్ వచ్చినట్లే.