‘డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్’ – జాను లైరి, షోనాలి ఎలిమినేట్

ఆహా డ్యాన్స్ షో ‘డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్’ నుంచి కంటెస్టెంట్ షోనాలి, ఆమె మెంటార్ జాను లైరి ఎలిమినేట్ అయ్యారు. 3rd ఎపిసోడ్ లో మెస్మరైజింగ్ పర్ ఫార్మెన్స్ ల తర్వాత ఫ్రైడే ఎలిమినేషన్ లో కంటెస్టెంట్ షోనాలి, మెంటార్ జాను లైరి ఎలిమినేట్ కావడం వ్యూయర్స్ ను షాక్ కు గురిచేసింది. డాన్స్ ఐకాన్ సీజన్ 2లో ఇది ఫస్ట్ ఎలిమినేషన్ కావడం విశేషం.

షోనాలి, జాను లైరి స్టేజ్ నుంచి వెళ్లిపోతున్న సందర్భంలో అంతా ఎమోషనల్ అయ్యారు. దీనికి తోడు ఫేవరేట్ కంటెస్టెంట్ బర్కత్ అరోరా అనారోగ్య కారణాలతో షోలో పాల్గొనలేకపోయింది. ఆమె స్థానంలో వర్తికా ఝా పాల్గొంటున్నట్లు హోస్ట్ ఓంకార్ ప్రకటించి సర్ ప్రైజ్ చేశాడు. వర్తికా ఝా తన వండర్ ఫుల్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ఇవే కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు సర్ ప్రైజ్ చేయబోతున్నాయి