సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ లో బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా ధర్మ

“డ్రింకర్ సాయి”తో తెలుగు ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు యువ హీరో ధర్మ. ఈ ఆదరణ సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ లో మరోసారి రిఫ్లెక్ట్ అయ్యింది. బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా హీరో ధర్మకు సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ దక్కింది. కెరీర్ బిగినింగ్ లోనే తనకు సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ రావడం ఎంతో ఎంకరేజింగ్ గా ఉందని హీరో ధర్మ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

గతేడాది థియేటర్స్ లోకి వచ్చిన “డ్రింకర్ సాయి” సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో హీరో ధర్మ తన డ్యాన్సులు, ఫైట్స్, యాక్టింగ్ తో అందరినీ మెప్పించాడు ధర్మ. సాయి పాత్రలో ధర్మ చేసిన పర్ ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. టీజింగ్, ఫన్, ఎమోషనల్ సీన్స్ లో మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు ధర్మ. హీరో ధర్మ ఫ్యూచర్ కెరీర్ కు “డ్రింకర్ సాయి” మంచి స్టెప్ అయ్యింది.