సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ లో పీపుల్స్ ఛాయిస్ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. క సినిమాలో అభినయ వాసుదేవ్, పెద్ద సార్(సోల్) క్యారెక్టర్స్ లో ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు కిరణ్ అబ్బవరం. ఆయన పర్ ఫార్మెన్స్ కు పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ దక్కింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా కిరణ్ అబ్బవరం ఈ అవార్డ్ అందుకున్నారు.
పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా గతేడాది దీపావళికి రిలీజైన క సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. థ్రిల్లర్ సినిమాను సకుటుంబంగా ప్రేక్షకులు చూసేలా రూపొందించిన దర్శకద్వయం సుజీత్, సందీప్ లకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్స్ గా సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్ వచ్చింది. క సినిమాకు రెండు అవార్డ్స్ దక్కడంపై హీరో కిరణ్ అబ్బవరం సంతోషాన్ని వ్యక్తం చేశారు. క సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.