సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ లో “బేబి” జోరు

సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ లో తన జోరు చూపించింది బేబి మూవీ. నాలుగు అవార్డ్స్ ను సొంతం చేసుకుని మరోసారి తన సత్తా చాటింది. అవార్డ్స్ వేదిక ఏదైనా బేబి మూవీకి ఆ పురస్కారాల గౌరవం దక్కడం గత రెండేళ్లుగా సాధారణమైంది. సైమా, గామా, ఫిలింఫేర్ సహా పలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ బేబి సినిమా గెల్చుకుంటోంది.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమంలో బేబి సినిమాకు నాలుగు అవార్డ్స్ దక్కాయి. బెస్ట్ మూవీతో పాటు బెస్ట్ హీరోగా ఆనంద్ దేవరకొండ, బెస్ట్ హీరోయిన్ గా వైష్ణవి చైతన్య, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా విజయ్ బుల్గానిన్ అవార్డ్స్ అందుకున్నారు. తమ సినిమాను ఇంత మెమొరబుల్ గా మార్చిన ప్రేక్షకులకు ఈ వేదిక మీద నుంచి థ్యాంక్స్ చెప్పారు నిర్మాత ఎస్ కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్.