కన్నా నీ ప్రేమ సంద్రమే, నేను నీ తీరమే..!

“దిల్ రూబా” సినిమా మ్యూజికల్ గా మంచి పేరు తెచ్చుకుంటోంది. ఈ మూవీలో ‘కన్నా నీ..’ పాట హైలైట్ అవుతుందని హీరో కిరణ్ అబ్బవరం ప్రెస్ మీట్స్ లో కాన్ఫిడెంట్ గా చెప్పారు. దాంతో ఈ పాట మీద మ్యూజిక్ లవర్స్ లో హైప్ క్రియేట్ అయ్యింది. ఆ మోస్ట్ అవేటెడ్ సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ‘కన్నా నీ ప్రేమ సంద్రమే..’ అంటూ సాగే ఈ పాటను సామ్ సీఎస్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. ‘హే జింగిలీ..’ అంటూ మాస్ లిరిక్స్ రాసిన భాస్కరభట్ల.. ఈ పాటలో ‘కన్నా నువ్వు నా ప్రాణమే, నేను నీ దేహమే..’ అనే లైన్స్ రాసి తనలోని క్లాస్ రైటర్ ను చూపించారు. పాటలోని డెప్త్ ను రెట్టింపు చేస్తూ పాడారు సత్యప్రకాష్, మాళవిక సుందర్. “దిల్ రూబా” సినిమాకు ఈ పాట స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది.

కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా నటించిన “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.